Sunday, 11 October 2020

గాంధీ ప్రశంస పొందిన పెన్నులు .

 

రాజమహేంద్రి  కోట గుమ్మంలోనున్న శివుడి బొమ్మ జంక్షన్ వద్ద ఆటోదిగాను.మోటార్ వాహనం నడపడం  భయం కాబట్టి  ఆటోలోనే ప్రయాణిస్తూఉంటాను. ఆటో డ్రైవర్  నన్ను నగరానికి అపరిచితుడిగా  భావించి  ఎదురుగా నున్న రహదారిని  చూపిస్తూ "ఇది ఈ  నగరానికి ప్రధాన రహదారి, ఇక్కడ గుండు సూది  నుండి వజ్రం వరకు మీకు లభిస్తాయి"  అన్నాడు. 

అది సాయంకాలం ఏడు  గంటల సమయం. అంతకు ముందే వాన జల్లు వలన వాతావరణం ఆహ్లాదకరంగా  ఉంది .అది వ్యాపారం రద్దీ సమయం కావడం వలన జనాన్ని దాటుకుంటూ  నా  ప్రసిద్ధ గమ్యస్థానమైన " రత్నం పెన్ వర్క్స్" చేరుకున్నాను. నేను  ఈ  షాపుకి  వెళ్ళడానికి రెండు కారణాలు  ఉన్నాయి . దేశం లో  చివరి " పెన్ స్మిత్ "లలో  ఒకరైన దుర్గా  ప్రసాద్ గారు అనారోగ్యంనుండి  కోలుకున్న సందర్భంలో  వారిని సందర్శించడం ఒక కారణం, మరియు చెన్నైలో  మిత్రుడు 

కొన్ని పెన్నులు కావాలని  కోరారు.అది ఒక కారణం. 

కమిషన్ ఫ్రీ లైజన్  ఏజెంటుగా పని చేసాను .





 



రత్నం పెన్స్ వారి నివాసం పురాతనమైన  పెంకుటిల్లు . ఈ  ఇల్లు ఇప్పుడు  హెరిటేజ్ హౌసులుగా పిలవబడుతున్నా. 1932 సం||  లో  ఈ  యింటినుండే  వెంకటరత్నం , సత్యనారాయణ అనే సోదరులచే  ఈ  వ్యాపారం ప్రారంభించబడింది . వీరు బంగారు నగలు చేయు కులవృత్తికి సంబంధించినవారు.వంశ పారంపర్యంగా వస్తున్న పెన్ తయారీ గురించి నేను ప్రశ్నించగా  ఆయన  నా ప్రశ్నకు సంతసించి , సమాధానం ఈ  విధంగా  చెప్పారు. " నా వంశంలో  నా దాయాదులు , మేనమామలు, వారి సంతానం క్రమంగా ఈ  పెన్ తయారీ కార్యక్రమంలో స్థిరపడ్డారు. వారంతట వారు  కొంతమంది యూనిట్లు ప్రారంభించసాగారు . కొంతమంది కార్మికులు కూడా పెన్ తయారీ  విద్య నేర్చుకొని వేర్వేరు యూనిట్లు కొనసాగించారు".

బంగారు మరియు వెండి పెన్నులు తయారీలో వారు ప్రత్యేకత కలిగియున్నప్పటికీ  వారు చేతితో తయారు చేసిన "యబోనైట్ " పెన్నులు చాల ప్రసిద్ధి పొందాయి. యబోనైట్ పెన్ను ఒకింటికి 1000/- రూపాయిలు మూల్యం అవుతుంది. పనితనము , సమయం ఎక్కువ తీసుకొనుట వలన  మూల్యం పెరుగుతుంది. యబోనైట్ రబ్బరు యొక్క కఠినమైన  రూపం . అవి వివిధ వర్ణాలతో వస్తూ  ఉంటాయి . కొన్ని గులాబీ, నలుపు మరియు ఆకుపచ్చవంటి రంగులతో ఉంటాయి. కొన్ని కర్ర  మీద చారల డిజైన్లలా  ఉంటాయి . దుర్గా  ప్రసాద్ గారు ఈ చారల పెన్నుల వైవిధ్యాన్ని జీబ్రా చారలతో పోల్చిచెప్పారు. ఏ రెండు పెన్నుల పోలిక ఒకేలా ఉండదు . యబోనైట్  రాడ్లను  లేత్ పై అమర్చి కావలిసిన ఆకారం కొరకు చేతి లోని సాధనములను ఉపయోగిస్తారు. అధికనాణ్యతతో కూడిన పాళీ (nib )లను అమర్చుట వలన ఈ పెన్ లతో వ్రాయు వారు సిరా ప్రవాహం అడ్డుపడక నిరాటంకంగా వ్రాయగలుగుదురు.

 ఆ  నాటి దేశ ప్రముఖులలో ఒకరైన J C  కుమరప్ప రాజమహేంద్రి వచ్చినప్పుడు వారి వద్ద రత్నం పెన్ కొని గాంధీగారికి బహూకరించిరి. గాంధీగారు ఈ పెన్ను ఉపయోగించిన పిదప వీరి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెచ్చుకొని రత్నం పెన్స్ వారికి ప్రశంసాపత్రము నొసంగిరి.



5 దశాబ్దాల కాలం పెన్ తయారీ అనుభవం గల దుర్గా ప్రసాద్ గారితో ప్రస్తావించిన సమయంలోనే అతి స్వల్ప వ్యవధిలోనే చెన్నైలోనున్న నా  మిత్రుడికి whatsapp లో పెన్నులు చూపగా 4000 రూపాయిలకు విలువ చేసే పెన్నులు విక్రయంజరిగినది. దీనికి సమాచార సాంకేతికమునకు  నా  కృతజ్ఞతలు. (వీరు అన్ని రకముల మొబైల్ ఆధారిత చెల్లింపులను అంగీకరిస్తారు)

క్రాఫ్ట్ ఎకనామిక్స్ యొక్క సాధారణ సిద్ధాంతమేమనగా  వారి సంతతివారు వారి వృత్తిలో ప్రవేశించినట్లైతే క్రాఫ్ట్ వృద్ధి  చెందుతున్న స్థితిలో ఉన్నట్లు చెప్పవచ్చు. కానీ దుర్గా  ప్రసాద్ గారి పిల్లలు వ్యాపారంలో లేరు . ఒకరు డాక్టర్, మరొకరు CA అభ్యసిస్తున్నారు. నేను సంశయంతో మీ పిల్లలు ఈ కళలో  ఎందుకు ప్రవేశించలేదని అడిగాను .భవిష్యత్తులో ముఖ్యమైన పనులున్నాయి , సమయం ఉంది అని సమాధానం ఇచ్చారు .వారు ఇంకా ఈ విధంగా అన్నారు భవిష్యత్తులో నేను బంగారు వెండి పెన్నులు తయారీ శిక్షణ యువకులకు ఇవ్వగలనని చెప్పారు .

ఆ రోజు రాత్రి 8 గం||  లకు నేను ఇంటికి తిరుగు ముఖం పట్టుతున్న సమయంలో  దుకాణాన్ని మూసివెయ్యమని తమ్మునితో సున్నితంగా ఆదేశించారు.

క్రొత్తపల్లి శ్రీనివాస్

10-10-2020

The photographs that follow this article are by Mr. V C Arun( Waynad, Kerala)

 


















3 comments: